కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సాయం అందించిన నూజివీడు జనసేన నాయకులు

     నూజివీడు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో నూజివీడు నియోజకవర్గ వలసపల్లి గ్రామంలో జనసైనికుడు గోపి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు గునుకుల శశితేజ వారి కుటుంబాన్ని పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం 12,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. అలాగే మీకు ఎటువంటి కష్టం వచ్చిన జనసేనపార్టీ మీకు తోడుగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, మండల అధ్యక్షుడు అబ్బురి రవికిరణ్, మండల నాయకులు కుమ్ముకురు సురేష్, పల్లి రాజు, జనసైనికులు తదితరులు  పాల్గొన్నారు.

See also  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ కు హాజరైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :