నివార్ బాధిత రైతులకు తక్షణమే సహాయం అందజేయాలి : జనసేన

నివార్ బాధిత రైతులకు తక్షణమే సహాయం అందజేయాలి : జనసేన

                   నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మారెడ్డి శివశంకర్ గారు ఆధ్వర్యంలో నిరసన దీక్షకు 88వార్డ్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన్ శ్రీకాంత్ గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓటు వేయడానికి రైతు కావాలి, దీక్షలు చేయడానికి రైతు కావాలి, పాదయాత్రకు రైతు కావాలి, కానీ రైతు రోడ్డు పైకి వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలని తక్షణ సాయం 10000/- ఇవ్వమంటే చేతులు రావా అని అన్నారు. మీకు వినపడదు కూడా, మీ భారతి సిమెంట్ లాభాలను ఇవ్వమనలేదు, మీ తండ్రిగారైన వైయస్సార్ సంపాదించిన ఆస్తులను ఇవ్వమనలేదు, ప్రజల కట్టిన టాక్స్ లో లేదా మద్యం షాపుల మీద సంపాదించిన డబ్బులు ను రైతులు ఇవ్వమంటే నీకేం నొప్పి అని ప్రశ్నించారు. దేవుడు కరుణిస్తే 3 సంవత్సరాలు మీ పదవీ కాలం, అదే మోడీ కొనిస్తే 1 సంవత్సరం మీ పదవీకాలం కావున రైతులు గమనిస్తున్నారు. మీరు రైతులకు న్యాయం రాబోయే రోజుల్లో ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్తారని మరియు రైతులకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ రైతు వైపు ఉంటుంది రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రైతుకు న్యాయం జరిగే వరకూ రైతు పక్షాన నిలబడుతూ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ బొత్స సత్యనారాయణ గారు, శివ గారు, సతీష్ గారు, సన్యాసి నాయుడు గారు , రామ నాయుడు గారు, మధు శంకర్రావు గారు, రమేష్ గారు, వరహాల గారు పెందుర్తి జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.

See also  కావేరీ రైతులకు సంఘీభావం తెలిపిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవ సంఘం