రేలంగి గ్రామంలో నూతన జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభం

     తణుకు ( జనస్వరం ) :  ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర గారు మాట్లాడుతూ రేలంగి గ్రామంలో జనసేన పార్టీ ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశి, రేలంగి గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి సత్యనారాయణ (అబ్బులు), తణుకు మండల అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గర్రె తులసీరామ్, పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ తమవరపు నరసింహారావు, మరియు ఇరగవరం మండలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేలంగి గ్రామం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  కాపులను అవహేళన చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి : జనసేన నాయకులు మత్స పుండరీకం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :