విశాఖజిల్లా నిరుద్యోగుల ఆవేదన..

విశాఖజిల్లా నిరుద్యోగుల ఆవేదన..

    విశాఖపట్నంలోని విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పోస్టులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకొనుటకు  చివరితేది 23 జూలై 2020గా నిర్ణయించారు . అయితే జూలై 21 నుండి 23 వ తేదీ వరకూ AMC కాలేజీ నందు నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. 21 మరియు 23 వ తేదీన వెళ్ళిన నిరుద్యోగులకు వారి అప్లికేషన్ తీసుకొని వారికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరిగింది. అయితే 22 వ తేదీన వెళ్ళిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకుండా, అప్ప్లికేషన్ ఒకటే తీసుకొని పంపించారు. రేపు ఫలితాలు ప్రకటించాక రిజిస్ట్రేషన్ నంబర్లతో విడుదల చేస్తే, 22న అప్లై చేసిన నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. 22 వతేదీన అప్లై చేసిన నిరుద్యోగులకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకుండా వారిని పరిగణలోకి తీసుకోకపోవడం వలన వారు నష్టపోయే ప్రమాదం ఉంది. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. 

See also  భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం : చంద్రగిరి జనసేన నాయకులు దేవర మనోహర

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి