వైసీపీ కార్యకర్తల కోసమే నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు : జనసేన నాయకులు డాక్టర్ యుగంధర్ పొన్న

వైసీపీ కార్యకర్తల కోసమే నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు : జనసేన నాయకులు డాక్టర్ యుగంధర్ పొన్నగంగాధర

             నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, ఆర్ కే వి బి పేట గ్రామపంచాయతీ, కలికిరి లో గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా మండల అధికారులు గుర్తించిన లబ్ధిదారులు మొత్తం 11 మంది అయితే అందులో నిజమైన లబ్ధిదారులు ముగ్గురు అనర్హులు ఎనిమిది మంది ఉన్నారని నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. 50 ఇల్లు నివాస ప్రాంతంగా కలిగిన ఈ గ్రామంలో అనర్హులు 8 మంది ఉంటే, పెద్ద పెద్ద గ్రామాలు, మేజర్ పంచాయతీ కలిగిన గ్రామాలలో, 6 మండలాల్లో ఇంకా ఎంతమంది అనర్హులు ఉండాలి ? ఎవరికోసం ఈ బినామీ ఇల్లు? నిజమైన నిరుపేదలను, అణగారిన ప్రజలను, ఎస్సీ,ఎస్టీ,బిసి,ఓసి,క్రిస్టియన్,మైనారిటీ ముస్లిం మైనారిటీ వర్గాలలోని నిరుపేదలను వదిలిపెట్టి స్థానిక అధికార పార్టీ నాయకుల కు దాసోహమై అనర్హులను ఎంపిక చేయటం చాలా దారుణం అని అన్నారు. ఈ చర్యను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్థానిక నాయకులకు, మంత్రులకు భయపడి పనిచేయటం మానాలని నిరుపేదల పక్షాన నిలబడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

See also  గెలుపే లక్ష్యంగా జనసేన - టిడిపి పయనం