
ఆత్మకూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న గ్రామాలను, పంటపొలాలను పరిశీలించిన ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్
తుఫాన్ కారణంగా ఆత్మకూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న గ్రామాలను, పంటపొలాలను ఈరోజు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సందర్శించడం జరిగింది. గతంలో 2001వ సంవత్సరంలో పెన్నానదికి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అప్పుడు కూడా ఈ స్థాయిలో గ్రామాలు ముంపునకు గురై పంట నష్టం జరగలేదు. అప్పటికీ ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందు ఉండి తుఫాను తీవ్రత మరియు జరగబోయే నష్టం ముందుగానే తెలుసుకునే వీలు, పాలకులకు మరియు అధికార యంత్రాంగానికి ఉంది. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి కూడా, 2001 సంవత్సరం కన్నా తక్కువగా, నేడు సుమారు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో అటు గ్రామాలు ముంపునకు గురై, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి కావడమే కాకుండా, కొన్ని వేల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. దీనికి కారణం, కేవలం పాలకులకు, అధికారులకు ముందుచూపు లేకపోవడమే. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ప్రతి సంవత్సరం జనవరి,ఫిబ్రవరి నెలలో సంగం ఆనకట్ట మీద ఇసుక బస్తాలను ఉంచి ఆనకట్ట ఎత్తును తాత్కాలికంగా పెంచుతారు. నవంబర్, డిసెంబర్ మాసాలలో నెల్లూరుకు తుఫాను గండం పొంచి ఉంటుంది, అని తెలిసి కూడా ఈ సంవత్సరం నవంబర్ మొదటివారం లోనే కట్ట ఎత్తును సుమారు ఎనిమిది అడుగుల వరకూ పెంచారు. ఫలితంగా వరద నీరు సహజంగా కిందకి పోయే వీలు లేక, అటు పెన్నా పరివాహక ప్రాంత గ్రామాల్లోనికి మరయు పంట పొలాల్లో లోనికి చొచ్చుకొని వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా కొన్ని వేల ఎకరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. దీనికి కారణం,అధికారులు మరియు పాలకులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, నవంబర్ నెలలోనే సంగం ఆనకట్ట ఎత్తును పెంచడమే, అని స్థానిక రైతాంగం అభిప్రాయపడింది. ముందుగానే ఇసుకబస్తాల కాంట్రాక్టర్ల జేబులు నింపటానికో లేక అధికార పార్టీ నాయకులు పెన్నా పరివాహక ప్రాంతంలో వేసిన చేపల చెరువులు, రొయ్యల చెరువులు నీరు అందించేందుకు వీలుగా ఆనవాయితీకి విరుద్ధంగా నవంబర్ నెలలో సంగం ఆనకట్ట ఎత్తును ఇసుక బస్తాలను వేసి పెంచడం వల్ల,తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వరద బాధితులు మనోవేదనకు గురవుతున్నారు. పాలకులు మరియు అధికారుల ముందు చూపు లేమి మరియు బాధ్యతారాహిత్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు మరియు తీవ్రంగా పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మల ప్రసాద్, హజరత్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.








