తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకుడు నగిరి పాటి. మహేష్ గారు

తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకుడు నగిరి పాటి. మహేష్ గారు

                రైల్వే కోడూరు ,వెంకటరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ లోని అరుంధతివాడలో  గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు అభివృద్దిలో నిర్లక్ష్య౦కు గురైతూ వస్తుందని జనసేన నాయకులు నగరిపాటి మహేశ్ అన్నారు.  సరైన సిమెంట్ రోడ్లు లేక మట్టి రోడ్లు మడులని తలిపిస్తున్నాయి ధ్వజమెత్తారు. పారిశుధ్య లోపం వలన విపరీతమైన దోమలు, క్రిమి కీటకాలు, విషపురుగులకి ఆశ్రయంగా మారి ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. సీజనల్ వ్యాధులు టైఫాయిడ్ ,మలేరియా, డెంగ్యూ, మరి ముఖ్యం గా covid 19 సేంకండ్ వేవ్ నీ దృష్టి లో పెట్టుకొని ముందస్తు చర్యలు చర్యలు చేపట్టాలని అధికారులను హెచ్చరించారు. సీసీ రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థని నిర్మించి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు,  గ్రామ పంచాయతీ సమస్యలను మహేష్ గారు  సెక్రెటరీ గంగాదేవి గారికి తెలియజేసి వినతి పత్రం ను సమర్పించడం జరిగింది. సదరు అధికారి మాట్లాడుతూ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

 

See also  గాంధీ గారి విగ్రహాన్ని మాయం చేసిన గాడ్సే ఎవరు ?