పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు

పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు

                  జనసేనపార్టీ అధ్యక్షులు నిర్ధేశించిన ఐదు నియోజకవర్గాల్లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. రెండో విడతలో భాగంగా 32 నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఇంచార్జ్ శ్రీ గుణ్ణం నాగబాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రత్యేక శిక్షణ తరగతులు రాష్ట్ర కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ కార్యాలయం పార్టీ కమిటీల్లో వీరికి స్థానం కల్పించబడుతుంది. అదే విధంగా జనసేన పార్టీ తరఫున భవిష్యత్తులో వీళ్ళు పోటీ చేసే దానికి స్థానం కల్పిస్తారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు క్షేమంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ప్రమాదవశాత్తు హాస్పిటల్ 50 వేల రూపాయలు జీవిత బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. మరే ఇతర పార్టీలు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పించిన అవకాశాన్ని కార్యకర్తలు అందరూ వినియోగించివలసిందిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  మున్సిపల్‌ ఎన్నికలకు జనసేనపార్టీ సిద్ధం - రాజంపేట జనసేన నాయకులు చెంగారి శివప్రసాద్‌