కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే GM కి వినతిపత్రం ఇచ్చిన మైలవరం ఇంఛార్జ్ అక్కల రామ్మోహనరావు( గాంధీ )

     కొండపల్లి, (జనస్వరం) : కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం  కొండపల్లి రైల్వే స్టేషన్ లో శాతవాహన స్టాప్ కొరకు అలాగే కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు( గాంధీ ) ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలసి రైల్వే GM ( సౌత్ సెంట్రల్ రైల్వే) అరుణ్ కుమార్ జైన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కల రామ్మోహనరావు( గాంధీ ) మాట్లాడుతూ కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు GM ని కలిసి వివరించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే కావాల్సిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, పగిడిపల్లి వెంకట్, రాగాల నాని, యర్రంశెట్టి సాయి, సామల సుజాత, దేవరకొండ చరణ్, సురేష్, చిట్టెలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, రమేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

See also  మండపేటలో అఖిలపక్షం సమావేశం, జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి