ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముదినేపల్లి జనసేన నాయకులు

ముదినేపల్లి

           కైకలూరు ( జనస్వరం ) : కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో ప్రజా పోరాట యాత్రకు సంబంధించిన ఎలక్షన్ వాహనం “వారహి” మరియు యాత్రకు సంబంధించిన వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు సంసిద్ధమైన జనసేనపార్టీ అధినేత  పవన్ కళ్యాణ్  గారికి సంఘీభావంగా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం జనసేన నాయకులు, జనసైనికులు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటూ ఉంటూ రాబోయే ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రజల కోసం పోరాడేలా మరింత బలం చేకూరాలని ప్రజల మన్నెలను పొందడానికి ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో జనసేన పార్టీకి బలం చేకూరేలా ఆ ఆంజనేయ స్వామి వారి అశీసులు ఉండాలి అని ఆయనకి తోడుగా మేము ఉంటామని అన్నారు. అని అయన ఆంధ్ర రాష్ట్ర మొత్తం ప్రజా పోరాట యాత్ర ద్వారా క్షేమంగా ప్రజల్లో తిరగాలని ముదినేపల్లి మండలం నాయకులు, జనసైనికులు కోరారు. ఈ సందర్బంగా ముదినేపల్లి మండలం అధ్యక్షులు వీరంకి వెంకయ్య, ఉమ్మడి కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శు వేల్పూరి నానాజీ, వీర మహిళ కేశన సంజన, కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్, వర్రే హనుమాన్, పోకల కృష్ణ, నాగ ఆంజనేయులు, జనసైనికులు యర్రంశెట్టి శివ, అంబుల భారత్, రమణ, సుదాబత్తుల సాయిష్, బోయిన వాసు, నాని, వెంకన్న మండలం జనసైనికులు, నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు.

See also  అక్షరమాల ఎడ్యుకేషన్ & చారిటబుల్ ఫౌండేషన్ కు నిత్యావసర సరుకులుఅందించిన కర్నాటక జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి