నర్సీపట్నం జనసేన ఆధ్వర్యంలో మదర్‌ థెరిస్సా జయంతి వేడుకలు

మదర్‌ థెరిస్సా

        నర్సీపట్నం రూరల్‌, (జనస్వరం)  : మధర్‌ థెరిస్సా జయంతిని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర గారు, మదర్‌ థెరిస్సా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గూదెపు తాతబాబు గారి ఆధ్వర్యంలో మధర్‌ థెరిస్సా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధర్‌ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పెదబొడ్డేపల్లిలోని నిరాశయుల ఆశ్రమంలో ఉన్న వారందరికీ పండు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యచంద్ర గారు మాట్లాడుతూ  సేవా భావం కలిగిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. సేవా భావం కలిగిన వ్యక్తి  మధర్‌ థెరిస్సా  అడుగుజాడల్లో  అందరూ నడుచుకోవాలన్నారు.  అనంతరం మధర్‌ థెరిస్సా ట్రస్టు సభ్యులు పెదబొడ్డేపల్లి బ్రహ్మణ వీధిలో వున్న రామాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, గ్రంధి కృష్ణ, నరేష్, వెంకటకృష్ణ, చల్లా సతీష్‌, సిహెచ్‌. మల్లేష్‌, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

See also  నగిరి నియోజకవర్గం నందు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి