
మాతృశ్రీ మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నూతన భవన నిర్మాణానికి లక్ష పదకొండు వేల రూపాయలు విరాళమిచ్చిన బెల్లంకొండ నరసింహారావు
సత్తెనపల్లి,ఏప్రిల్ 27 ( జనస్వరం)
పట్టణంలోని మాతృశ్రీ మొల్లమాంబ వృద్ధాశ్రమం నందు నూతన భవన నిర్మాణంలో భాగంగా ఒక గదిని నిర్మించడానికి పెద్దలు బెల్లంకొండ నరసింహారావు మంచి మనసుతో , సేవా హృదయంతో 111116 రూపాయలతో ఒక గది నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ నరసింహారావు ధర్మపత్ని వెంకట రామ సుబ్బమ్మ కుమారుడు బెల్లంకొండ వెంకట సాయి కుమార్ ఉషా రాజ్యలక్ష్మి, బెల్లంకొండ నాగ సాయి ప్రసాద్ పాల్గొనడం జరిగింది.ఆశ్రమ నిర్వాహకులు ఆరేపల్లి ఏడుకొండలు బెల్లంకొండ నరసింహారావు కి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని శాలువతో సత్కరించడం జరిగింది. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాన్ని చేసి ఆశ్రమం నిర్మాణానికి ఆశ్రమ అభివృద్ధికి సహకరించినటువంటి బెల్లంకొండ నరసింహారావుకి ఎంతో మంచి మనసు ఉండటం వలన ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారని,వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆశ్రమంలో ఇంకా నాలుగు గదులు ఉన్నాయి.ఎవరైనా దాతలు వస్తే వారి పేర్లను శిలాఫలకంపై రాసి గదికి పెడతామని తెలియజేస్తూ ఇంకా కొందరు దాతలు సహృదయంతో ముందుకు రావాలని ఆశ్రమంలో వృద్ధులను ఆదుకోవాలని తెలిపారు.

నరసింహారావు కి ఆశ్రమంలో వృద్ధులు ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు.








