ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి,కలెక్టర్ విజయ సునీత

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS )ముఖ్య ఉద్దేశం – మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి.

పొదిలి,మే 29 ( జనస్వరం)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ” ఒక నియోజకవర్గం- ఒక నెల -నాలుగు వారాలు ” కార్యక్రమంలో భాగంగా మూడవ శుక్రవారం ” ప్రజా సమస్యల పరిష్కార వేదిక (P. G. R. S) కార్యక్రమం పొదిలి పట్టణంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంనకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ M.విజయ సునీత,జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ M. శివరాం రెడ్డి విచ్చేశారు.ఈ ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు.

 

ఈ కార్యక్రమంలో 240 మంది తమ అర్జీలు సమర్పించారు.

See also  జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తామంటున్నా 12వ డివిజన్ ప్రజానీకం