కరోనా నిబంధనలు పాటించకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రులు, అధికారులు : బీజేపీ నేత దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి

                  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి & రాజంపేట పార్లమెంట్ ఇన్ చార్జ్ దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా రెండవ దశ విస్తృతంగా వ్యాపిస్తున్న సందర్భంలో రాష్ట్రప్రభుత్వం సదుపాయాలతో పేషెంట్లను ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి పెనుగొండ నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మాలగుండ్లు శంకర్ నారాయణ గారు నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు వాలంటీర్లను సన్మానిస్తూ వాళ్లకు అవార్డులు ఇస్తున్నారు. ఒక బాధ్యతయుమైన మంత్రి తన బాధ్యతను మరిచి నిబంధనలు పాటించకుండా బహిరంగ సభల సన్మానాలు పెట్టుకోవడం పరిస్థితి ఎంతవరకు సబబు అని బిజెపి ప్రశ్నిస్తున్నదన్నారు. పెనుగొండ పట్టణంలో అధిక పాజిటివ్ కేసులు నమోదు అయితే దానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి కూడా కనీస పరిజ్ఞానం నిబంధనలు పాటించకుండా ఏదో ఇప్పుడే అంతా మునిగిపోయింది అన్నట్లు వాలంటీర్లకు సన్మానాలు చేయడం అవార్డు ఇవ్వడం మంత్రి స్థాయికి తగని తగనిది. ఒకవైపు జిల్లాలో ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక ఆక్సిజన్ లేక అంబులెన్స్ లేక సిబ్బంది కొరతతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సర్వజన ఆసుపత్రి లో కూడా కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అయితే రోగికి కి సహాయం చేసే సిబ్బంది లేరు. రోగి యొక్క బంధువులే ఈరోజు వారికి సహాయాన్ని చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది . ఒక పాజిటివ్ వచ్చిన రోగికి ఒక సాధారణ పౌరుడు సహాయం చేసినట్లయితే అది ఇంకొక వ్యక్తికి పాజిటివ్ రావటానికి అవకాశం ఉంది. వ్యాధి ప్రబలడానికి కారణం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వ్యాధిని వ్యాప్తి చేస్తుంది అనిపిస్తుంది. ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అయితే రెండు మూడు గంటల పాటు నీరు కూడా అందని పరిస్థితి నీరు కూడా అందని పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైపు చూస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వేలుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇదివరకూ తాత్కాలికంగా వైద్యులను, వైద్య సిబ్బందిని, ల్యాబ్ టెక్నీషియన్, రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల కిందట వారిని జీతాలు ఇవ్వకుండా వారిని పని నుండి తీసివేసింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 5400 మందిని నియమించాడానికి ఉత్తర్వులు జారీ చేసి ఇదంతయు కూడా అవగాహన లేక ముందు చూపు లేక పని చేస్తున్నటువంటి సిబ్బందిని తొలగించిన పరిస్థితి.
                  బిజెపి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుచేసింది ఎవరైతే సిబ్బందిని నియమించారో వారిని రెగ్యులర్ చేయమని పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశాం. దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలోని మంత్రి అదేవిధంగా కలెక్టర్ అధికారులను సమన్వయం చేసుకొని ఈ విపత్కర పరిస్థితులలో ప్రజలకు సహాయం చేయాల్సింది పోయి వీరు ఒక్క పూర్తిస్థాయి రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్న పాపాన పోలేదు. దీనికంతటికి కూడా అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయ లోపంగా కనిపిస్తున్నది. జిల్లాలో ఎక్కువ కరోనా పెరగడానికి అదే విధంగా వారు మరణాలు చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించవలసి ఉంటుందని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. ఇప్పటికైనా జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి రోగులకూ సరైన వైద్యం ఆహారము, మంచినీళ్లు, విద్యుత్తు ఆక్సిజన్, మందులు, కనీస సౌకర్యాలను కల్పించుటకు ప్రయత్నించాలి లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. 

See also  బొబ్బిలి జనసైనికుల ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం