
– విద్యార్థుల చేత తల్లులకు పూలాభిషేకం
గోకవరం, జూలై 24 (జనస్వరం): రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా గోకవరం మండలం రంపఎర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బులు కన్వీనర్‌గా వ్యవహరించగా, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ గంటా శ్రీను అధ్యక్షత వహించారు. పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు పెద్దిరెడ్ల రాజు వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సూరంపాలెం ప్రాజెక్ట్ చైర్మన్, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి ఉంగరాల రాము, మాజీ సర్పంచ్ బాదంపూడి హర్షిత ప్రకాష్, జిల్లా పరిషత్ హైస్కూల్ తొలి తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నందం పాపారావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు సత్యం పెద్దబ్బులు (వెంకటేశ్వరరావు), మానవ హక్కుల ఫౌండేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయులు వంగలపూడి వెంకటేశ్వరరావు, తోట్టా మల్లేశ్వరరావు, పెనుగొండ సత్యానందం, పప్పు బుజ్జి, షేక్ మగ్ధం, అడబాల వెంకటేశ్వరరావు (అబ్బు), జాజుల అవతారం రఫీ, గుల్లింకల నాని, రామకృష్ణ, స్కూల్ మేట్ ట్రస్ట్ అధ్యక్షుడు కాకర విష్ణు, చిక్కం రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఘనతను వ్యాఖ్యాత పెద్దిరెడ్ల రాజు తన వాక్చాతుర్యంతో చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లులకు పూలతో సత్కారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ వేషధారణలు సభకు హాజరైన అతిథులు, తల్లిదండ్రులను అలరించాయి. అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








