సంపర గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

జనసేన

           అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం సంపర గ్రామంలో మండల అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి  ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.  ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావాడ నాగు, ఆ గ్రామ జనసేన ఎంపీటీసీ, సీతారాం, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

See also  VRA లు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ముదినేపల్లి జనసేన నాయకులు