యలమంచిలి మండల ప్రైవేట్ (బడ్జెట్) విద్యా సంస్థల సమావేశం

యలమంచిలి, జూలై 24 (జనస్వరం): యలమంచిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో బుధవారం సాయంత్రం యలమంచిలి మండల ప్రైవేట్ (బడ్జెట్) విద్యా సంస్థల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్డురోడ్డు ఆదర్శ స్కూల్ కరస్పాండెంట్ రామరాజు హాజరై అధ్యక్షత వహించారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై కరస్పాండెంట్లు చర్చించారు. తాము జీవనోపాధి పొందుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న బడ్జెట్ పాఠశాలలకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలను సమాన దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక సెయింట్ మేరీ, సెయింట్ జూడ్స్, అలివేలుమంగ, విజ్ఞాన భారతి, మాంటిస్సోరి, క్రిసెంట్ కాన్సెప్ట్, శ్రీ గౌరీ, ఏటికొప్పాక సాధన, అక్షర, పూలపర్తి సాయి సంపత్, కొక్కెరాపల్లి సరస్వతి, సోమలింగపాలెం సెయింట్ జాన్స్, మళ్లా జగన్నాథం మెమోరియల్ స్కూళ్ల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

See also  చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ఆధ్య్వర్యంలో లీగల్ సెల్ కమీటీ ఆత్మీయ సమావేశం