శృంగవరపుకోట ఓటరు నమోదు అధికారితో జనసేన నాయకుల సమావేశం

శృంగవరపుకోట

       శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకులతో ఓటరు నమోదు అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ B. పద్మావతితో జనసేన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో B.పద్మావతి మాట్లాడుతూ, ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయుంచుకోవాలని, దీనిపై ఆవాగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పారు.  రాబోయే ఎన్నికలకు పోలింగ్ బూతులు గత ఎన్నికల్లో నిర్వహించిన పోలింగ్ బూత్ స్టేషన్ల భవనాలు శిథిలావస్థకు కు చేరడంతో కొన్ని పోలింగ్ బూతులు మార్పులు చేయడం జరిగిందని వీటిపై పలు సందేహాలు ఉన్నచో అభిప్రాయంలు, సలహాలు, సూచనలు అన్ని పార్టీ నాయకులు అందించవచ్చని తెలిపారు. ఫారం 6,7,8,అంటే ఓటరు గా నమోదు, తొలగింపు, సవరణ, బదిలీ వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ, మీరుకూడా ఎన్నిక కు సంబంధించి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే బాధ్యత వహిస్తూ, సహకరించాలని తెలియజేసారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరి ఉపయోగించుకునే లా తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత మరియు జిల్లా =లో నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కులేని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖంగా సందేశాన్ని ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేసారు.

See also  గతేడాది ఇస్తామన్న వరద బాధిత సాయం నేటికీ ఇవ్వలేదు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి