పెద్దమంగళాపురం గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

           పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో మరియు కూరంగి నాగేశ్వరావు (SBI రిటైర్డ్ మెనేజర్) గారు, (Gems Hospital) సిబ్బంది సమక్షంలో స్థానిక పెద్దమంగళాపురం గ్రామం జనసేన నాయకులు జల్లు సోంబాబు గారు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా 150 కి పైగా ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వారికి సుగర్, బిపి, ఈసీజీ, గుండె సంబంధిత పరీక్షలు చేశారు. అన్ని రకాల వైద్య సేవలు, మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు గారు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న అందుబాటులో ఉంటామని స్వయంగా వైద్యం చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

See also  New Delhi Shivaji Jayanti service activities community participation

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి