పాయకరావుపేట నియోజకవర్గములో జనసేనపార్టీ లోకి భారీగా చేరికలు

పాయకరావుపేట

      పాయకరావుపేట, (జనస్వరం) :   జనసేన పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారు  ఆశయాలు, సిద్దాంతలు నచ్చి  రాష్త్ర కార్యదర్శి గౌ.శ్రీ. బోడపాటి శివదత్ గారి ఆధ్వర్యంలో  పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం లోని రాజయ్య పేట గ్రామం నుంచి జనసేన పార్టీ లోకి 150 మంది వివిధ పార్టీల నాయకులు ఒకేసారి చేరడం జరిగింది.  వారందరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ  కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ.శ్రీ. శివశంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శివశంకర్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీ లోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు.  వైసిపి ప్రభుత్వము పై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును  ప్రజల్లోకి తీసుకెళ్లి   పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమములో గ్రామ పెద్దలు పిక్కి లక్ష్మమ్మ w/o సత్తియ్య గారు మరియు వారి మూడు తరాల కుటుంబ సభ్యులందరూ సుమారు 150 మంది పైనే మన జనసేన పార్టీలో చేరినారు. పిక్కి తాతారావు, పిక్కి రాంబాబు, పిక్కి దేవుడు, పిక్కి కోదండరావు, పిక్కి రమణ, పిక్కి వెంకటేష్, పిక్కి గురుమూర్తులు, పిక్కి గోపి, పిక్కి రాము, పిక్కి కాశి, పిక్కి దేవరాజు, పిక్కి రాము, చేపల రామకృష్ణ, చోడిపల్లి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ ను విమర్శించే విషయములో ఉన్న శ్రద్ధ, రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన నాయకులు మాదాసు మురళి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి