పాయకరావుపేట మండలంలో జనసేనపార్టీలోకి భారీ చేరికలు

    అనకాపల్లి జిల్లా (జనస్వరం) పాయకరావుపేట మండలం నుంచి గజపతినగరం గ్రామానికి చెందిన గోశాల తాతారావు, మహంకాళి, రాము ,వెంకటేష్, బాలాజీ ,జగదీష్ శ్రీకాంత్ తో పాటు టిడీపీ, వైసీపీ నుంచి 45 మంది జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి గెడ్డం బుజ్జి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బుజ్జి వారితో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకువెళ్లాలని గెడ్డం బుజ్జి అన్నారు. మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.

See also  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలి : తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్