ఆదోనిలో జనసేనపార్టీలోకి భారీగా చేరికలు

        ఆదోని ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆదోని ఎస్ సి కాలనీకి మరియు పెద్దతుంబలానికి చెందిన 50 కుటుంబాలు జనసేనపార్టీలోకి చేరారు. ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. పార్టీలోకి జాయిన్ అయిన వారికి జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, మహబూబ్, షైక్, అలీ, రాజు తదితరులు పాల్గొన్నారు. 

See also  రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది : గుంటూరు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి