రామ్ తాళ్లూరిని కలిసిన మర్రిపాడు జనసేన నాయకులు చిన్నా జనసేన

మంగళగిరి, నవంబర్ 18, (జనస్వరం) : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని మర్రిపాడు మండల జనసేన నాయకులు ఈరోజు కలిసి మండలంలో చేపట్టిన పార్టీ కార్యకలాపాలపై వివరాలు అందించారు. మర్రిపాడు మండల స్థాయిలో గత దశాబ్దంగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని నాయకులు సమావేశంలో తెలిపారు. పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాల్ని గ్రామస్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని వారు వివరించారు. మండలంలో జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన చర్యలను వివరించిన నాయకులు, భవిష్యత్తులో పార్టీ వ్యాప్తి పెంచేందుకు జరగబోయే ప్రణాళికలపై కూడా రామ్ తాళ్లూరితో చర్చించారు. చిన్నా జనసేన కృషిని అభినందించిన రామ్ తాళ్లూరి, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే భవిష్యత్తు విజయాలకు పునాది అవుతుందని పేర్కొన్నారు.

See also  విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టండి : పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి