ఉరి వేసుకొని వివాహిత అనుమానాస్పద మృతి

దెందులూరు, మార్చి 30 (జనస్వరం) : మండలంలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన తంగేళ్ల అప్పారావు, లత (20) దంపతులకు ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి అప్పారావు, లత అదే గ్రామంలో తల్లిదండ్రుల ఇంటిలోని ఒక గదిలో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా చిన్నపాటి విభేదాలు, గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న అప్పారావు పనికి వెళ్లిన తరువాత, లత ఇంట్లో మనస్పర్ధల కారణంగా మనస్థాపానికి గురై ఉరివేసుకుని మృతి చెందింది. దీంతో దెందులూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, లత మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించి విచారణ ప్రారంభించారు.

See also  తిరుమలలో రూమ్ దొరకడం లేదా ? అయితే ఇలా చేయండి