మంచి నీటి కోసం మన్యం ఆదివాసుల గ్రామ ప్రజలు ఇక్కట్లు

మన్యం

                మన్యం ప్రాంతంలో తాగునీటికి తీవ్రరకొరత‌ ఏర్పడింది.ఆదివాసి గ్రామాల్లో నేటికి చెలమ నీరు గతిగా వుంది. సీతంపేట మండలం కె.వీరఘట్టం గ్రామా పంచాయితీకి తాగునీటి పథకాలు మూలనపడ్డాయి. వేసవికి ముందే తాగునీటి కొరత తలెత్తింది. ఆదివాసి గ్రామాలల్లో తాగునీటి సమస్య మరింత‌ జఠిలంగా వుంది. సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ధల ద్వారా కోట్ల నిధులు ఖర్చుపెట్టిన వైనం కాస్తా నిరుపయోగంగానే మారింది. ఏటికేడాది తాగునీటి సమస్యలు జఠిలంగా మారుతున్న పట్టించుకుంటున్న పరిస్ధితి కన్పించడం లేదు. ఏటాకోట్లు ఖర్చు పెడుతున్నా గిరిజనానికి రక్షిత మంచినీరు దక్కటం లేదు. వేసవిలో మంచినీటికి చెలమ నీరేదిక్కు. ఆదివాసి గ్రామాలు మంచినీటి తీవ్రతతో కటకటలాడుతున్నారు. గ్రామంలో ఉన్న బోర్లు, వాటర్ ట్యాంకులు మంచినీటి పథకాలు మూలన పడ్డాయి. కె.వీరఘట్టం గ్రామంలో సుమారు ఐదువందల కుటుంబాలు నివసిస్తున్నారు. మంచినీటి కోసం రెండు కిలోమీటర్లు సమీపంలోని పంట పోలాల్లో ఉన్న చెలమనీరు తాగాల్సిన దుస్థితి దాపురించింది. చెలమలు కుంటల్లోని నీటినే తాగాల్సి వచ్చి ఆనారోగ్యం పాలవుతున్నారు. కలుషిత నీటిని వాడడం వల్ల వాంతులు, నీళ్లవిరేచనాలు, ఉ.కామెర్లు, జ్వరాలు ఉదర సమస్యలతో గిరిజనులు అవస్థలు ఎదుర్కోంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కె.వీరఘట్టం గ్రామా పంచాయితీకి మంచినీటి సమస్యను తీర్చాలని స్ధానిక గిరిజనులు కోరుతున్నారు.

See also  సాంఘిక సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేసిన జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్