చేబ్రోలు మండలం జనసేనపార్టీలోకి పలువురు యువకులు చేరిక

    చేబ్రోలు, (జనస్వరం) : గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మండల అధ్యక్షులు చందు శ్రీరాములు, మండల కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ, వైసీపీ పార్టీలనుండి భారీగా జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ప్రముఖ న్యాయవది గేర సత్తయ్య, రిటైర్డ్ కానిస్టేబుల్ జయరాం, ఫణి కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ, టీడీపీ తరుపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి యువత చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి మేకల రామయ్య, చేబ్రోలు మండల ఉప అధ్యక్షులు నారిశెట్టి కృష్ణయ్య, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  జర్నలిస్టుల కాలనీలో అక్రమణలు తొలగించాలి : జనసేన నాయకులు గురాన అయ్యలు