
కదిరి, (జనస్వరం) : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని SVK కళ్యాణమండపం నందు శుక్రవారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఇంచార్జ్ శ్రీ భైరవ ప్రసాద్ అధ్యక్షతన దాదాపు 30 మంది మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వీరిని జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాలు మరియు ఆయన చేస్తున్న పోరాటాలు నచ్చి ఈ రోజు మేము పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పవన్ రావాలి పాలన మారాలి ఆన్న సిద్ధాంతంతో పని చేస్తామని వారు పేర్కొన్నారు. నిన్నటి దినం జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, ఇంచార్జీ వారు మాట్లాడుతూ పార్టీ క్రియాశీలక సభ్యత్వం మండల కమిటీల బలోపేతం చేయడం పైన వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీ మతి.అనురాధ, వీరమహిళ శ్రీ మతి.లక్ష్మి, మండల కన్వీనర్లు చలపతి, మహేష్, రమణ, చౌదరి, రవీంద్ర నాయక్, లక్ష్మణ్, శ్రీనివాసులు, చక్క రమణ, అంజిబాబు, గణేష్, నాగేంద్ర, రెడ్డి, వంశీ, భాస్కర్, రవి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.









