
అంగన్ వాడి పోస్టుల్లో అవకతవకలు, సమస్యను పరిష్కరించకపోతే జనసేన పోరాటం చేస్తుంది : నలిశెట్టి శ్రీధర్
సంగం మండలం కోలగట్ల గ్రామానికి చెందిన అంగన్వాడీ వర్కర్ పోస్ట్ కు సంబంధించి సెప్టెంబర్ 22వ తారీఖున ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఆర్డిఓ గారి అధ్యక్షతన ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూలో తమకు అన్యాయం జరిగిందని బాధిత మహిళలు జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. బాధిత మహిళల తరఫున ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆర్. డి .ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వివరములు లోనికి వెళితే సంగం మండలం, కోలగట్ల గ్రామానికి చెందిన అంగన్వాడీ వర్కర్ పోస్ట్ కు సంబంధించి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఆ.ర్డి.ఓ గారి అధ్యక్షతన ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూ కు దొంతాల కామాక్షమ్మ(పదవ తరగతి మార్కులు-502), బొద్ధుకూరు నాగ శరణ్య(పదవ తరగతి మార్కులు-450), కంచుపాటి శ్యామల(పదవ తరగతి మార్కులు-398) , దొంతాల దొరసానమ్మ(పదవ తరగతి మార్కులు-5.0గ్రేడ్), దొంతాల నాగరూప, దొంతాల పార్వతి, కూనిపోగు జయంతి (పదవ తరగతి మార్కులు-242) పాల్గొన్నారు. పాల్గొన్న వారందరిలో తక్కువ మార్కులు వచ్చిన మరియు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సర్టిఫికెట్ లతో కూనిపోగు జయంతి ఉద్యోగ అర్హత పొందడం, ఈ ఉద్యోగం కొరకు ప్రయత్నించిన దరఖాస్తుదారుల అందరికీ అనుమానానికి తావిచ్చింది. వీరు జనసేన పార్టీని సంప్రదించగా, జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ఆ ర్.డి.ఓ గారికి వివరములు తెలిపారు. ఆర్డిీవో గారు దీనిపై తగిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు తగిన న్యాయం ఆర్డివో గారు చేస్తారని ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ వ్యక్తం చేశారు. లేనిపక్షంలో బాధితుల తరపున జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని జనసేన పార్టీ తరపున తెలియజేస్తామని ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు.









