
విశాఖలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో మహాదాన 4 మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం
గాజువాక నియోజకవర్గంలో వేకప్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్, ఫ్రెండ్స్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహాదాన 4 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర పీ.ఏ.సీ సభ్యులు, గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు విచ్చేసి ఈ (ఎఫ్.బి.డి.ఏ) సంస్థ చేస్తున్న బ్లడ్ క్యాంపులు అత్యవసర సమయంలో రక్తాన్ని అందించి పలువురు ప్రాణాలు కాపాడే విధంగా చేస్తుందని, పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ఈ రక్త దాన మహాదానం కార్యక్రమం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేకించి వేక్ అప్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఫ్రెండ్స్, బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ వారికి అత్యవసర సమయంలో నేనున్నానంటూ ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తాన్ని అందించే వినోద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు రామకృష్ణ గారు, గాజువాక జనసేన పార్టీ నాయకులు కరణం కనకారావు గారు, కోన చిన్న అప్పారావు గారు, గుంటూరు మూర్తి గారు, పాలరౌతు వెంకటరమణ గారు, రౌతు గోవింద్ గారు, ఏడిది భార్గవ్ గారు, రొయ్య రత్నం గారు, దల్లి గోవింద్ గారు, ముమ్మన మురళి గారు, కతా శ్రీను గారు, ములకలపల్లి వంశీ గారు, యెరిపిల్లి నూకరాజు గారు, పిడుగు బంగార్రాజు గారు సుధమల పవన్, కరణం బాబురావు గారు, చోడిపిల్లి ముసలయ్య, ఢిల్లీ, కామేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.








