శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో దాతల సహాయంతో ప్రతి శనివారం మహా అన్నదాన కార్యక్రమం

కారంపూడి, ఆగస్టు 01( జనస్వరం)

పట్టణం లోని గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో ప్రతి శనివారం దాతల సహాయంతో మహా అన్నదాన కార్యక్రమం 300 మందికి నిర్వహించడం జరుగుతుంది ఈ వారం దాతలుగా 150 మందికి కీర్తిశేషులు వెలుగూరి. శేషారత్నం జ్ఞాపకార్థం సహకరించిన వారు వెలుగూరి నాగేశ్వరావు మరియు కుటుంబ సభ్యులు, మరో 150 మందికి చిటిప్రోలు ప్రవీణ్ కుమార్ ధర్మపత్ని ధనలక్ష్మి శివ సాయి ఆర్యభవన్ మంగళగిరి, ఇల్లూరి పుల్లయ్య ధర్మపత్ని ఆదిలక్ష్మి, ఒప్పిచర్ల, తొలిచూరిశరత్ బాబు ధర్మపత్ని భాగ్యలక్ష్మి కార్తికేయ పౌల్ట్రీ ఫీడ్స్, అందరూ కలిసి 300 మందికి సహాయ సహకారాలు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు వెలుగూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మనిషి ఆకలి తీర్చటం గొప్ప సంకల్పం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇటువంటి కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించాలని తెలిపారు, నారాయణ సేవ కార్యక్రమాలు అన్న ప్రసాద కమిటీ ఫౌండర్ భవిరిశెట్టి రామారావు , అన్నప్రసాద మహిళా కమిటీ సభ్యులు చిన్ని లక్ష్మి, భవిరిశెట్టి సీతామహాలక్ష్మి,పల్లా పద్మ, చింతల శారద, సముద్రాల పద్మ, కొల్లిపర వెంకటలక్ష్మి కుమారి, ఊటుకూరి వెంకాయమ్మ, సూరే ధనలక్ష్మి, యక్కల రమాదేవి, బచ్చు నాగమణి, గుండా కమల కుమారి, తదితరులు ఈ నారాయణ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు

See also  సినీ నటుల అభిమానుల్లో రాజకీయ చైతన్యం పెరగాలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి