
జనసేనాని అడుగు జాడల్లో నడిచి పార్టీని బలోపేతం చేద్దాం : పూతలపట్టు నియోజకవర్గ జనసైనికులతో బుస్సా రాజేంద్ర ఉద్ఘాటన
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో మనమందరం నడిచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేద్దాం అని పూతలపట్టు నియోజకవర్గ జనసైనికులతో హైకోర్టు న్యాయవాది, జనసేనపార్టీ నాయకులు బుస్సా రాజేంద్ర ఉద్ఘాటించి జనసైనికులకు మీకు అన్నిటా వెన్నంటి ఉంటామని చెప్పి మనోధైర్యాన్ని నింపారు. ఆదివారం మధ్యాహ్నం బంగారుపాళ్యం మండలం కేజీసత్రంలో పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని జనసైనికుల ఆత్మీయసమావేశం జరిగింది. ఈ సమావేశం ఐరాల నరిగన్నగారి తులసీప్రసాద్, చీకూరుపల్లి నెహ్రూ రాయల్ ఆధ్వర్యంలో కోవిడ్ నియమని బంధనలు అనుసరించి, తగు జాగ్రత్తలు తీసుకుని అందరూ మాస్కులు ధరించి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బుస్సారాజేంద్ర, ఆవుల శాంతమూర్తి, బుస్సా గోపాలకృష్ణ, పుంగనూరు నానబాల లోకేష్ రాయ్, విజయ్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు నాయకులు, జనసైనికులు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీని పటిష్టపరిచేందుకు అందరూ ఏకతాటిపైకి వచ్చి క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పూతలపట్టు, ఐరాల, బంగారుపాళ్యం, తవణంపల్లి, యాదమరి మండలాల నాయకులు శ్రావణ్, పరమశివయ్య, పురుషోత్తం, కుమార్, ప్రసాద్, మైలారి కిషోర్, మునిరాజులు, చంటి, ఓంప్రకాష్, దుర్గా రాయల్, కిషోర్, ఆగారపు రమేష్, వంశీ, చందు, పూల జ్యోతిప్రకాష్, మనోహర్, మహేష్, భరత్, నవీన్, లోకేష్ తదితర జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.









