దుప్పటి ఇద్దాం – చలి నుండి రక్షిద్దాం : జనసేన నాయకులు

దుప్పటి ఇద్దాం – చలి నుండి రక్షిద్దాం : జనసేన నాయకులు

                కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ Rk ఆధ్వర్యంలో చలికాలంలో రోడ్డు పక్కన నిరాశ్రయులుగా ఉన్న వారికి అదే విధంగా వికలాంగులకు, పేదలకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పేదలకు యాచకులకు, వికలాంగులకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది.. అలాగే గుడివాడ పట్టణ ప్రజలు మీ ఇళ్లలో ఉన్న పాత దుప్పట్లు గాని, షట్టర్లు గాని, మీ మోటార్ వెహికల్, కార్లో గాని పెట్టుకుని రోడ్డుమీద నిద్రిస్తున్న యాచకులకు పేదవారికి అందజేయాలని కోరడం జరిగింది. ప్రతి ఒక పౌరుడు సమాజానికి మానవత్వంతో మంచి చేయాలని కోరారు.  జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకొని సమాజానికి మంచి చేస్తున్నామని తెలియజేసినారు. ఇదివరకు మా యువత ఫ్రెండ్స్ పబ్లు పార్టీలు అంటూ  తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చెడు దారిలో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు అయ్యి మాకున్న దానిలో పదిమందికి సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, పండు, జగదీష్, సతీష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించిన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి