ఝాన్సీరాణి లక్ష్మీబాయి స్పూర్తితో పోరాడదాం : పాలకొల్లు జనసేన వీరమహిళలు

పాలకొల్లు

          పాలకొల్లు ( జనస్వరం ) : పాలకొల్లు నియోజకవర్గం వీర మహిళ విభాగం 194వ జయంతి సందర్భంగా ఝాన్సీ రాణి  లక్ష్మీబాయి గారికి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ  దేశ ప్రజలపై తెల్లదొరల దమనకాండకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం సాగించి ఆత్మార్పణం చేసిన దిశాలి ఝాన్సీ రాణి అని తెలుపుతూ పవన్ కళ్యాణ్  మహిళా సాధికారతకు, రాజకీయాలలో మహిళల ప్రాధాన్యతకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయని, మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వంలో మహిళలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, మహిళా సాధికారత పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని, జనసేనపార్టీ వీర మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రియా, భవాని, పద్మజ, షేక్ వల్లియా, ఝాన్సీ, పార్వతి పాల్గొన్నారు.

See also  గోంగూర పచ్చడి నూరి, తేనె వేసి ఇదే ఆనందయ్య మందు అని అమ్ముకునే ప్రబుద్ధులు ఉంటారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి