ఆళ్లగడ్డలో బలిజ సోదరుల ఆత్మీయ సమ్మేళనం చేపట్టిన నాయకులు

– శ్రీకృష్ణ దేవరాయల వారి పరిపాలన సాగిస్తున్న పవన్ కళ్యాణ్…

– ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం..

– డిప్యూటీ సియంకు అభినవ కృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్ బిరుదు రావడం పట్ల బలిజ సంఘం నాయకుల హర్షం..

ఆళ్లగడ్డ, డిసెంబర్ 14, జనస్వరం : ఆళ్లగడ్డ లోని సోదరుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు నల్లగట్ల బాలుడు, మైలేరి మల్లయ్య, అర్జిగారి నరసింహులు పాల్గొని మాట్లాడారు. పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా ‘అభినవ కృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్’ బిరుదు ప్రదాన కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇది సేవకు, త్యాగానికి, ప్రజాప్రయోజన నాయకత్వానికి లభించిన మహా గుర్తింపు అని అన్నారు. ఆళ్ళగడ్డలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం దగ్గర అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. శ్రీ కృష్ణ దేవరాయలు ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మదిలో నిలిచారన్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రజలు మద్దతు మెండుగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు చాలా గొప్పవన్నారు. ప్రతిఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బలిజ సోదరులు కొల్లం పుల్లయ్య, సిద్ది నారాయణ, ఆకుల నడిపి వెంకటసుబ్బయ్య, జిల్లా సుబ్బరాయుడు, గుత్తి నరసింహుడు, మైలేరి మల్లయ్య, ఏరువ కృష్ణమూర్తి, గుబగుండం ఆంజనేయులు, మద్దిలేటి, జింక వెంకటస్వామి, నీలి వెంకటేశ్వర్లు, దేవా ఆంజనేయులు, లక్ష్మీ నరసయ్య, కొండపేట వీరయ్య, రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, బావికాడికి గుర్రప్ప, దూలం చైతన్య, చిన్న పెద్దయ్య, శ్రీకాంత్ కోరే వేణు, మంగమ్మగారి ప్రసాద్, మైలారి శ్రీరాములు, మైలారి శ్రీనివాసులు, సూరా చిన్న నరసింహులు, లక్ష్మీనారాయణ , నీరుకట్టు రామయ్య పాల్గొన్నారు.

See also  నిబంధనల మేరకే ఇసుక రీచును నడపాలి : జనసేన నాయకుడు అతికారి దినేష్