అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్‌ అప్రజాస్వామికం : జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

    అమరావతి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై ప్రకాశం జిల్లాలో పోలీసులు లారీ ఛార్జ్‌ చేయడం దురదృష్టకరం. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యే. పలువురికి గాయాలయ్యాయని, ఓ రైతుకు చేయి విరిగిందని సమాచారం అందింది. వీరికి అవసరమైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ యాత్ర వార్తల కోసం వెళ్ళిన పాత్రికియులను సైతం పోలీసులు నియంత్రిస్తుండటం మీడియా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే. పోలీసులు ఈ యాత్రపై ఆంక్షలు పెంచడం, అడ్డంకులు కల్పించడంలో అసలు ఉద్దేశం ఏమిటో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్ధం అవుతూనే ఉంది. రోడ్లను దిగ్బంధించి, చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు రైతుల యాత్రను విఫలం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు.

See also  విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల చనిపోయిన ఉద్యోగి నరేంద్ర కుటుంబానికి అండగా జనసేన