కృష్ణా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

విద్యుత్

       కృష్ణా ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ సూచన మేరకు, కృష్ణా జిల్లాలో నియోజకవర్గ ఇంచార్జ్ లు కలెక్టర్ కార్యాలయంలో పెంచిన విద్యుత్ ధరలు వెంటనే తగ్గించాలని నిరసన చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ కి వినతిపత్రం కృష్ణాజిల్లా జనసేన నాయకులతో కలిసి అందించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని చెప్పి ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా చార్జీలు పెంచడం ప్రజల్ని మరోమారు మోసం చెయ్యడమే అవుతుందని ప్రభుత్వంఫై దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్ మోహన్ రావు (గాంధీ), కృష్ణా జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ, మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, కోలా రాజు, పోలిశెట్టి తేజ, వై.నరసింహారావు మరియు నాయకులు కటకం ధర్మారావు, రమేష్ బాబాయ్, ఆదినారాయణ, నాగబాబు, శివ, ప్రవీణ్ వెంకటస్వామి, బి.వి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

See also  రాష్ట్రానికి పట్టిన గ్రహణం సీఎం జగన్ వైసీపీ పార్టీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి