
గన్నవరం, (జనస్వరం) : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నిడమానూరు గ్రామంలో కరోనా మహమ్మారి నుండి తమ జీవితాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ వేయటంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశా వర్కర్లకు మరియు ANMలకు జనసేన పార్టీ తరపున గుంటుపల్లి హర్ష ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ గారి చేతుల మీదుగా పార్టీ షీల్డ్స్, నూతన వస్త్రాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంధం గోవర్ధన్, బంద్రెడ్డి రవి, చీమట రవి వర్మ, పాశం నాగబాబు, లంకే సురేష్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.









