కొమర్రాజులంక అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

కొమర్రాజులంక అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

               తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలం యందు కొమర్రాజు లంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం కారణంగా, నందమూరి వీర్రాజు, రజక కులస్తులకు చెందిన రెండు పోర్షన్ల తాటాకు పెద్ద ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో, ఆ కుటుంబానికి చెందిన వారు ఆర్థికంగా, తీవ్రంగా నష్టపోయి పూర్తిగా నిరాశ్రయులైయినారు. వారికి అండగా వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, వారి కుటుంబానికి నిత్యావసర వస్తువులను, కూరగాయలను, కిరాణా సామాన్లుతో పాటు బియ్యము, కొంత ఆర్థిక సహాయం అందించారు.  ఆగ్రామ, మండల జనసేన సైనికులుతో కలిపి, వారికి ఉడతా భక్తిగా బండారు శ్రీనివాస్ సహాయ సహకారాలు అందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దహనమైన ఇల్లుని చూసి ఎంతో చలించిపోయిన బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, వెంటనే ఈ నిరాశలైన అగ్ని ప్రమాద బాధితులను, ప్రభుత్వ అధికారులు వెంటనే ఆదుకోవాలని, రెవెన్యూ, సంబంధిత ఉన్నతాధికారులకి ఫోన్ ద్వారా తెలియజేస్తూ, తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వము, ఇల్లు కోల్పోయిన అగ్నిప్రమాద బాధితులకు తక్షణం స్పందించి, వెంటనే పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. కొమర్రాజులంకలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే కొత్తపేట నియోజకవర్గ జనసైనికులు స్పందించి వెంటనే వచ్చి, అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచినందుకు గ్రామంలో ఉన్న పలువురు గ్రామ ప్రజలు, మహిళలు, గ్రామ జనసేన కార్యకర్తలు బండారు శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. 

See also  జనసేన పార్టీతోనే అవినీతి రహిత పాలన సాధ్యం