జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి గడప గడపకు వివరించిన కొత్తపల్లి జనసైనికులు

    కైకలూరు, (జనస్వరం) : జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలలో నడుస్తూ తమవంతు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేస్తూ 2019 నుండి అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమదైన శైలిలో పేరు పొందిన వాటిల్లో కైకలూరు నియోజకవర్గ ముదినేపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం ఒక్కటి. జనసేన పార్టీ మలిదిశ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం క్రిందటి నెల 21వ తేదీన పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. చివర తేదీ దగ్గర పడడంతో జనసేన క్రియశీలక సభ్యతం గురించి గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల నుండి అనూహ్య స్పందన రావడం సంతోషమని, చాలా మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెవేశ పెట్టిన జీవిత బీమా గురించి కూడా ప్రజలకి వివరించారు. జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదములు తెలిపారు. రానున్న ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక్క ఛాన్స్ ఇస్తాం అని, ఈసారి తప్పకుండ జనసేన పార్టీని గెలిపించుకుంటాం అని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జనసైనికులు పాల్గొన్నారు.

See also  క్షేత్ర స్థాయిలో తిరిగి స్థానికుల కష్టాలను తెలుసుకున్న జనసేన వీర మహిళ వినుతా కోట

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి