జనసేన వీరమహిళ వ్యాపారానికి అండగా జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు

జనసేన వీరమహిళ

       దెందులూరు ( జనస్వరం ) : విజయరాయి గ్రామానికి చెందిన జనసేన చిన్నమ్మగా పిలవబడే చేపల వ్యాపారి చిన్నమ్మగారి చేపల కొట్టులో తరుచుగా రాత్రి వేళలు చేపలను గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు స్థానిక జనసైనికుల ద్వారా సమస్యను తెలుసుకొని చిన్నమ్మ గారి కొట్టు పరిసరాలు పరిశీలించి, వారిని దిగులు చెందవద్దని ధైర్యం చెప్పారు. దుండగులను ఎట్టి పరిస్థితిలోనూ వదలబోవమని మాట ఇచ్చారు. వారి కొట్టు ఆవరణలో నిఘా కెమెరాలు మరియు ఇనుప గ్రిల్లులు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి, తక్షణ సహాయంగా వారికి 10,000 ఆర్థిక సహాయం అందజేసారు. వ్యాపారానికి పూర్తిభద్రత కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని ,ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు.

See also  ఎచ్ఛర్ల నియోజకవర్గంలోకి వైసీపీ, టీడీపీ పార్టీల నుండి జనసేనలోకి చేరికలు