ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం కోసం KNOW MY CONSTITUENCY : వినుతా కోట

KNOW MY CONSTITUENCY

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇంచార్జ్ వినుత కోటా అడుగులు వేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి మండలంలోని రెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో సమస్యలు  ప్రధానంగా త్రాగు నీరు సమస్య, డ్రైనేజీ కాలువలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు తమ దృష్టికి వచ్చాయని తెలియజేశారు. సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు నితీష్ కుమార్, రవి కుమార్ రెడ్డి, శ్రీను, శ్రీనివాసులు, గిరీష్, అశోక్, కుమార్,తేజా, జనసైనికులు పాల్గొన్నారు.

See also  సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ..