నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ నుండి కీలక నాయకులు జనసేన పార్టీలోకి చేరిక

వైసీపీ పార్టీ

   నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ యువజన విభాగం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం సతీష్ గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి మాట్లాడుతూ గాదం సతీష్ గారు పార్టీలోకి రావడం ఎంతో ఆనందదాయకం అనీ, వైసీపీ సీనియర్ నాయకులు పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలో చేరి, బలోపేతానికి కృషి చేస్తానని మాట ఇవ్వడం శుభపరిణామమని, దీర్ఘకాలంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులను మా జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాధ్యాతాయుతమైన పదవులతో గౌరవించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా గాదం సతీష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది అనీ, వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా రాజీనామా చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు సూచనలతో పని చేసుకుంటాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

See also  “JSP గ్లోబల్ టీం” తో జనసేనపార్టీ తూర్పుగోదావరి అధ్యక్షులు కందుల దుర్గేష్ గారితో జూమ్ కాల్ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి