నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డ పోలీసుల తీరుని ఖండించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

 నెల్లూరు

        నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో  నేను లేని సమయంలో నిన్న నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ వారు కార్యాలయంలోకి చొరబడ్డ  తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా నాన్న గారు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసారు. మా  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాన్న గారు కూడా పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసారు. మాకు పోలీసులంటే ఎనలేని గౌరవం ఉంది. కానీ ఇలాంటి కొంతమంది పోలీసులు అధికార పార్టీ మెప్పు కోసం అత్యుత్సాహంతో అవివేకంగా ప్రవర్తించే తీరు వలన పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రజల్లో ఉండే ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంది. నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ప్రజలకు, పోలీసులకు అందుబాటులో ఉండే నాపై ఇలాంటి చర్యలకు పోలీసులు పాల్పడాల్సిన అవసరం లేదు. అన్ని రోజులు ఒకేలా ఉండవని గుర్తు పెట్టుకోండి. మా జనసేన  అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రోజున ఇలా ఒక సొంత అజెండాతో పని చేసే పోలీసులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని  ఆయన తెలియజేశారు.

See also  పథకాలకు పేర్లు పెట్టుకుంటే సరిపోదు. క్షేత్ర స్థాయిలో అమలు చేయాలి : జయరాంరెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :