కేతం రెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు, 50 మంది రక్తదానం చేసిన జనసైనికులు

కేతం రెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు, 50 మంది రక్తదానం చేసిన జనసైనికులు.

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు ఘనంగా జరిగాయి.
అందులో భాగంగా కేతంరెడ్డి యువసేన ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు కాకు మురళి రెడ్డి మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు, కేతంరెడ్డి యువసేన అధ్యక్షులు చెరుకూరి హేమంత్, మల్లేశ్వరరావు, వెంకట్, చందు,మజహర్, జయదేవ్ యువరాజ్, షారుక్, మహిళా నాయకులు ఇందిరా రెడ్డి శిరీష రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

See also  అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపిన గుంటూరు జనసేన నాయకులు