కావలి పట్టణం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 38వ వార్డ్ లో *జనం కోసం జనసేన*  

      కావలి, (జనస్వరం) :  కావలి నియోజకవర్గ ఇంచార్జి అలహరి సుధాకర్, కావలి జిల్లా ప్రధాన కార్యదర్శి సమన్ను వెంకట సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు పొబ్బా, కావలి పట్టణ 38వ వార్డు ఇంచార్జీ మన్నేపల్లి రిషి కేశ్ ఆధ్వర్యంలో *జనం కోసం జనసేన* కార్యక్రమం కావలి పట్టణములో ప్రతీ వార్డుకు ఇంటి ఇంటికీ వెళ్ళే కార్య క్రమములో భాగంగా 32 వ వార్డ్ లో ఘనంగా నిర్వహించిన తరువాత 38వ వార్దు వైకుంఠపురంలో పతీ ఇంటికి వెళ్ళి పాంప్లేట్స్ ఇచ్చి జనసేన గాజుగ్లాసు గుర్తుకు కావలిలో ఓటువేసి పవన్ కళ్యాణ్ ని AP కి CM ను చేసుకుందాము అని విస్తృత ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ ” ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన ఉందని రెండు పార్టీలు మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు ఈ సారి తప్పక పవన్ కళ్యాణ్ పార్టీ గాజు గ్లాసు కే ఓటు వేస్తామని చెప్పడం జరిగింది” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు.

See also  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి