కర్నాటకలో 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన కన్నడ జనసైనికులు

కర్నాటకలో 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన కన్నడ జనసైనికులు

                        జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్ స్ఫూర్తితో సాగుతున్న జనసేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలను దాటి పొరుగు రాష్ట్రాలకు సైతం పాకాయి. జనసైనికులు,  పవన్ కల్యాణ్ అభిమానులు కష్టాల్లో ఉన్న నిరు పేదలను ఆదుకునే క్రమంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రంలో 60 నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాన సేవా సంఘం ఆధ్వర్యంలో కోలార్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో తమవంతు పేదలకు అండగా నిలుస్తున్నట్టు ఈ సందర్భంగా  ఆనంద్ తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

See also  వేడుకలా జరిగిన 200వ రోజు పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి