విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కందుల నాగరాజు వరుస పర్యటనలు

కందుల నాగరాజు

        విశాఖపట్నం ( జనస్వరం ) : ప్రజల కోసం పనిచేయడం తనకెంతో ఇష్టమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 95 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 30 వ వార్డు కొత్త జాలారి పేటకు చెందిన పెళ్లి కుమార్తె భానుకు పట్టుచీర, బంగారు తాళిబొట్టు, పసుపు కుంకుమ అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తాను చేపట్టిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం నేటికీ 95 రోజులు పూర్తి కావడం సంతోష మన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జన సైనికులు, వీర మహిళలే కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన మేర తన పరిధి మేరకు చాలా మందికి సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగతంగా కూడా చాలామందికి తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే జనసేన జయమని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక పార్టీ నేతల సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉసిరికాయల యజ్ఞేశ్వరి, శ్రీహరి, శ్రీదేవి, కోదండమ్మ, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, మణికంఠ, శ్రీను, జోగిరాజు, తదితరులు పాల్గొన్నారు.

See also  గూడూరు పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి : జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి