కువైట్ లో ఘనంగా కంచన శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

కువైట్, అక్టోబర్ 2, (జనస్వరం) : కువైట్ దేశం ఫరవానియా నౌషాద్ హోటల్ లో గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ జన్మదిన వేడుకలను కువైట్ లో నివసిస్తున్న జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిలి ఓబులేసు, కోలా మురళి, పెంచలరాజు, అల్లం ప్రేమ్ రాయల్, కొమ్మినేని బాలాజీ, మొగిలిశెట్టి మనోహర్, రెడ్డిచర్ల ఆంజనేయులు, బుర్రా శంకర్, పసుపులేటి రాజేష్, పోతంశెట్టి వినురాయల్, ఆకుల సుమన్, ప్రేమ్ శ్రీహరి, ఉగ్గు పెంచలయ్య, అక్కమగారి చలపతి, అరిపినేని సుబ్బు రాయల్ తదితరులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కువైట్ లో ఉన్న ప్రవాసాంధ్రులు కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని సౌమ్యుడు, మృదుస్వభావి, స్నేహశీలి, సేవాగుణం కలిగిన కంచన శ్రీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ చేపట్టారు. అనంతరం హాజరైన అతిథులకు సన్మానాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు శ్రీకాంత్ అభిమానులు, అన్నతమ్ముళ్లు, మిత్రులు, ఆడపడుచులు మరియు పలువురు ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

See also  రామచంద్ర నాయక్ ని ఘనంగా సన్మానం చేసిన ఆర్కేఆర్ సేవా సమితి