దామలచెరువు జనశ్రేణులతో కలసి స్థానిక సమస్యలు మరియు పార్టీ బలోపేతం అంశాల గురించి చర్చిన కంచన శ్రీకాంత్

దామలచెరువు జనశ్రేణులతో కలసి స్థానిక సమస్యలు మరియు పార్టీ బలోపేతం అంశాల గురించి చర్చించిన కంచన శ్రీకాంత్

         ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు.. కానీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువులో అభివృద్ధి మాత్రం శూన్యం. ఎక్కడ చూసినా గుంతలతో ఉన్నటువంటి రోడ్లు, వెలగని వీధి లైట్లు, ప్రత్యర్ధ పార్టీ బెదురింపులు, నిరుద్యోగ సమస్య ఇలాంటి పలు అంశాల మీద జనసేన నాయకులు, జనసైనికులు చర్చించారు. ఈ కార్యక్రమంలో  కంచన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఎలాంటి సమస్య వున్నా, ఏ సమయములో అయినా అందరికి అందుబాటులో ఉంటానని కార్యకర్తలకి భరోసా కల్పించారు. అలాగే కరోనా కష్టకాలంలో జనసైనికులు అందరూ కలసి తిరుపతి రుయా హాస్పిటల్ కి ఆక్సిజన్ వెంటిలేటర్ సెట్ ని, మరియు కరోనాతో తల్లి,తండ్రులని కోల్పోయిన కుటుంబానికి 25000 రూపాయల ఆర్ధిక సహాయం అందుంచినందుకు అభినందిస్తూ వారిని శాలువాతో సత్కరించి మెమెంటోని అందజేశారు. ఈ కార్యక్రమంలో దామలచెరువు జనసేన నాయకులు సోహైల్, నసీర్, నాగూర్, మధుసూధన్, కొత్తూరు గిరీష్, భార్గవ్, హబీబ్, రహమతుల్లా, నౌమూన్, షాజహాన్, చలపతి, ఇమ్రాన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

See also  భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్