
కళ్యాణదుర్గం, జనవరి 5, (జనస్వరం) : జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా “ప్రత్యేక హోదా” కోసం సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కారణంగా నమోదైన కేసు విచారణలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సోమవారం కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో ఉద్యమాన్ని ప్రభావితం చేసినందుకు పోలీసులు నమోదు చేసిన ఈ కేసు ఇప్పటికీ కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సోమవారం వాయిదా ఉండటంతో బాల్యం రాజేష్ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి కళ్యాణదుర్గం కోర్టుకు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల హక్కుల కోసం జరిగిన పోరాటమని, అందులో భాగంగా పాల్గొనడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.








